Feb 14 2026ఫిబ్రవరి 14 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 14 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము కృష్ణ పక్షం

తిథి: ద్వాదశి మ.3.24 కు తదుపరి త్రయోదశి 15 సా.4.38 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: పూర్వాషాఢ 15 సా.6.00 కు తదుపరి ఉత్తరాషాఢ 15 రా.7.42 కు
యోగం: సిద్ధి తె.3:17 కు తదుపరి వ్యతీపాత 15 తె.2:46 కు
కరణం: తైతుల సా.4:02 కు తదుపరి వణిజ 15 సా. 5:05 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.18 - 9.04 కు
వర్జ్యం: రా.2.34 - 4.17 కు
అమృతకాలం: మ. 01.13 - 02.57 కు
సూర్యోదయం: ఉ. 6.47 కు
సూర్యాస్తమయం: సా. 6.13 కు

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈరోజు చేయాలి.

🕉️ శనిప్రదోషం 🕉️

గురుబోధ:
సూర్యపుత్రుడు శనైశ్చరుడు మహానుభావుడు. ఈయనకి సూర్యుడు, శివుడు, బ్రహ్మ, విష్ణువు ఎన్నో వరాలిచ్చారు.
o జన్మలగ్నంలో శని ఉన్నవారు లేదా జన్మలగ్నం నుండి రెండవ స్థానములో శని ఉన్నవారు, అష్టమశని (ఎనిమిదో స్థానంలో శని) ఉన్నవారు, అర్ధాష్టమశని, ఏలినాటిశని ఉన్నవారు 40 రోజులు, రెండు పూటలా ఈ స్తోత్రం చేస్తే శనిప్రభావం తగ్గుతుంది. తీవ్రమైన కష్టనష్టాలు రావు. శుభం జరుగుతుంది.
o సుప్రభాత సమయంలో శుచిగా, పవిత్రంగా శనైశ్చర స్తోత్రము చేయాలి. ఇలా చేస్తే మహాఫలితం వస్తుంది.
o శనివారం నువ్వులనూనె శరీరమంతా రాసుకుని స్నానం చేస్తే అష్టమశని ప్రభావం శాశ్వతంగా తొలగిపోతుంది.
o శనివారంనాడు నువ్వులనూనెతో శనైశ్చర విగ్రహాన్ని అభిషేకించి, ఆ తైలం కొంచెం కొద్దిగా తీసుకొని, కన్నులు మూసుకొని మన కనురెప్పలపై లేపనంగా రాసుకుంటే నేత్రసంబంధిత పీడలు తొలగిపోతాయి.
o నువ్వులు, నువ్వులనూనె దానం పుచ్చుకున్నవారు ఈ శనైశ్చర స్తోత్రము చదివి, గాయత్రీ మంత్రజపం (పది/ నూరు/సహస్ర) చేసుకుంటే, వారికి దానములు పుచ్చుకోవడం వల్ల వచ్చే నష్టములు ఉండవు. వారికి గ్రహదోషాలూ ఉండవు, వారు మహాత్ములు అవుతారు.
o పర్వకాలాలలో అనగా సంక్రాంతి, చతుర్దశి, అష్టమి అనే ప్రత్యేక కాలాలలో ఈ స్తోత్రం చేస్తే కురుక్షేత్రంలో గ్రహణస్నానానంతరం కోటిబారువుల బంగారం దానం చేసినంత ఫలితం కలుగుతుంది. కురుక్షేత్రంలో స్నానం గొప్పది, గ్రహణస్నానం మరింత గొప్పది, గ్రహణస్నానానంతరం సువర్ణదానం చాలా గొప్పది. ప్రభాసక్షేత్రంలో, కురుక్షేత్రంలో దానం చేయలేనివారు ఈ స్తోత్రంతో ఆ ఫలితం పొందవచ్చు.

శని స్తోత్రం పిప్పలాద ప్రోక్తం👇
https://youtu.be/97Q4_4k_hH4?si=54rRaEOlttF4jmx4

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less