" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 14 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం కృష్ణ పక్షము తిథి : నవమి రా. 02గం౹౹46ని౹౹ వరకు తదుపరి దశమి వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : అనూరాధ రాత్రి 09గం౹౹40ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ యోగం : ధృవ మధ్యాహ్నం 12గం౹౹26ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత కరణం : కౌలవ ఉదయం 09గం౹౹04ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹46ని౹౹ నుండి 09గం౹౹36ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹57ని౹౹ నుండి 11గం౹౹47ని౹౹ వరకు వర్జ్యం : తెల్లవారి 03గం౹౹01ని౹౹ నుండి 04గం౹౹33ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 11గం౹౹40ని౹౹ నుండి 01గం౹౹13ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹32ని౹౹ కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹57ని౹౹ కు గురుబోధ మనం చేసిన మహాపాపములనే అడవిని తగులబెట్టే భయంకరమైన దావాగ్ని చంద్రశేఖరుని యొక్క నామస్మరణం. ఆ గరళకంఠుని నామం గరుత్మంతుడు. మనకు ఉన్న వ్యసనములు పాములు. గరుత్మంతుడు ఎలా అయితే పాములను భక్షిస్తాడో, అలాగే శివ శివ అనుకోవడం మనకున్న వ్యసనములనే పాములను తొలగజేస్తుంది. విశ్వేశ్వరుని యొక్క పాదపద్మసేవనమే నిత్యజీవనం అనుకోవాలి. ఇక్కడ జీవనం అంటే మంచినీళ్ళు. మంచినీళ్ళు తాగుతున్నంత తేలికగా శివుణ్ణి సేవించాలని భావం. అనగా మంచినీరు తాగుతున్నాశివుడిని స్మరించమని అంతరార్థం. అలా చేస్తే జీవితంలో కష్టం రాదు, వచ్చినా తట్టుకుని నిలబడి మళ్ళీ పైకొచ్చే శక్తి, ఆత్మవిశ్వాసం పరమేశ్వరుడిస్తాడు. అందుకే జీవులు సాధ్యమైనంత చంద్రశేఖరనామస్మరణ చేసుకోవడం ఉత్తమం. - శ్రీ శివమహాపురాణం.