కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 13 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము కృష్ణ పక్షం
తిథి: ఏకాదశి మ.1.44 కు తదుపరి ద్వాదశి 14 మ.3.24 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: మూల మ.3.52 కు తదుపరి పూర్వాషాఢ 14 సా.6.00 కు
యోగం: వజ్ర తె.3:23 కు తదుపరి సిద్ధి 14 తె.3:17 కు
కరణం: బాలవ మ.2:26 కు తదుపరి తైతుల 14 సా.4:02 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 9.04 - 9.50 కు, మ. 12.53 - 1.38 కు
వర్జ్యం: మ. 2.06 - 3.52 కు, రా.2.19 - 4.04 కు
అమృతకాలం: ఉ. 09.13 - 10.59 కు
సూర్యోదయం: ఉ. 6.47 కు
సూర్యాస్తమయం: సా. 6.13 కు
🕉️ ఏకాదశి, కుంభసంక్రమణం 🕉️
ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీ పారణ రేపు చేయాలి.
గురుబోధ:
శివరాత్రికి ఉపవాసం చేసి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి, తన శక్తిననుసరించి నన్ను పూజించిన వ్యక్తి ఒక ఏడాది పాటు నన్ను నిత్యం పూజించిన ఫలితం పొందుతాడు. దానివల్ల ఆ వ్యక్తికి నిరంతర శుభాలు కలుగుతాయి. చంద్రుడు ఉదయించగానే సముద్రం ఎలా ఉప్పొంగుతుందో, శివరాత్రి రాగానే, శివధర్మం అభివృద్ధి పొందుతుంది. అందువల్ల శివరాత్రి నాడు శివప్రతిష్ఠా కార్యక్రమం, కల్యాణోత్సవాలు జరిపిస్తే, సకల మంగళాలూ లభిస్తాయి.
ఏకాదశి అంటే హరిహరులకు ప్రీతి. ఏకాదశి అంటేనే యమకింకరులు వణికిపోతారు. ఏకాదశి నాడు : 1) ఒక వెయ్యీ ఎనిమిది తులసీదళాలతో, బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించినవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. 2) చామంతిపువ్వులు, తులసీదళాలతో విష్ణువును పూజించినవాడు మంచిపదవిని పొందుతాడు.
శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=RPp4NvWRPHQW0Khk
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial