" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 13 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం కృష్ణ పక్షము తిథి : అష్టమి (14వ తేదీ) తె. 04గం౹౹14ని౹౹ వరకు తదుపరి నవమి వారం : ఇందువారం (సోమవారం) నక్షత్రం : విశాఖ రాత్రి 10గం౹౹22ని౹౹ వరకు తదుపరి అనూరాధ యోగం : వృద్ధి మధ్యాహ్నం 02గం౹౹17ని౹౹ వరకు తదుపరి ధృవ కరణం : బవ ఉదయం 09గం౹౹45ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12గం౹౹39ని౹౹ నుండి 01గం౹౹25ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹56ని౹౹ నుండి 03గం౹౹42ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 02గం౹౹15ని౹౹ నుండి 03గం౹౹48ని౹౹ వరకు అమృతకాలం : మధ్యాహ్నం 01గం౹౹42ని౹౹ నుండి 03గం౹౹16ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹32ని౹౹ కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹57ని౹౹ కు గురుబోధ విభూతి రేఖలు నుదుట ధరించేవారిని, రుద్రాక్షలు ధరించిన వాళ్ళని నా లోకానికి తీసుకునిరావద్దు అని యమధర్మరాజు యమకింకరులతో అన్నాడు. అందుకే పూర్వం పెద్దలు రాత్రి పడుకునేప్పుడు విభూతి పెట్టుకోమనేవారు. శివధర్మమే పరమధర్మము, చాలా సూక్ష్మమైనది. శివరాత్రినాడు కపటంతోనైనా విభూతి ధారణచేసిన వారి, శివుని సన్నిధానంలో ఆవునేతితో దీపం వెలిగించే వారి పాపరాశి భస్మమైపోతుంది. - శ్రీ శివమహాపురాణం.