Feb 12 2026ఫిబ్రవరి 12 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 12 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము కృష్ణ పక్షం

తిథి: దశమి మ.11.45 కు తదుపరి ఏకాదశి 13 మ.1.44 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: జ్యేష్ఠ మ.1.27 కు తదుపరి మూల 13 మ.3.52 కు
యోగం: హర్షణ తె.3:05 కు తదుపరి వజ్ర 13 తె.3:23 కు
కరణం: బవ తె.1:27 కు తదుపరి బాలవ 13 మ.2:26 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10.36 - 11.21 కు, మ. 3.09 - 3.55 కు
వర్జ్యం: రా.10.15 - 12.04 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 6.47 కు
సూర్యాస్తమయం: సా. 6.12 కు

గురుబోధ:
అన్నద్రోహం, గురుద్రోహం, బ్రహ్మద్రోహం న కారయేత్ - అన్నం పెట్టినవారిని, బ్రహ్మజ్ఞానులను ద్వేషించేవారిని, గురుద్రోహులను పిశాచములు పట్టుకుంటాయి. అందుకే ఎప్పుడూ జాగరూకతతో శివనామస్మరణంతో మన బుద్ధి, మనసు, ఆత్మ పవిత్రంగా ఉండేలా ప్రదక్షిణలు, పూజ, అర్చన, అభిషేకములు వీలైనంత తరచుగా చేసుకుంటూ ఉండాలి, కుదరని పక్షంలో ఈ భగవత్ కార్యక్రమాలు చేసుకునేవారికి వీలైనంత సహాయం చేయాలి. - శ్రీ శివమహాపురాణం.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less