Feb 12 2023ఫిబ్రవరి 12 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఫిబ్రవరి 12 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం కృష్ణ పక్షము 

తిథి : సప్తమి (13వ తేదీ) తె. 05గం౹౹22ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం :  స్వాతి రాత్రి 10గం౹౹42ని౹౹ వరకు తదుపరి విశాఖ
యోగం : గండ  మధ్యాహ్నం 03గం౹౹35ని౹౹ వరకు తదుపరి వృద్ధి 
కరణం :  వణిజ ఉదయం 09గం౹౹45ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 04గం౹౹27ని౹౹ నుండి 05గం౹౹12ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 04గం౹౹13ని౹౹ నుండి 05గం౹౹47ని౹౹ వరకు
అమృతకాలం : మధ్యాహ్నం 01గం౹౹49ని౹౹ నుండి 03గం౹౹26ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹33ని౹౹ కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹56ని౹౹ కు

🕉️👉భానుసప్తమి👈🕉️

గురుబోధ 
ఆదివారం మరియు సప్తమీ తిథి సూర్యునికి అత్యంత ప్రీతికరం. ఆ రెండు కలసి ఒకే రోజు వస్తే దానిని భానుసప్తమీ పర్వదినం అంటారు. ఈ రోజు చేసే ఏ కార్యమైనా వేల రెట్ల ఫలితం ఇస్తుంది. పైగా మాఘమాసంలో ఈ పర్వదినం మరింత విశేష ఫలితం ఇస్తుంది.

చంపకం (సంపంగి), కేతకం (మొగలి) పువ్వులు తప్ప ఏ పుష్పమైనా శివునికి సమర్పించవచ్చును. నమకచమక సహితంగా శివుని తరచుగా అభిషేకించినవాడు శివునికి ప్రీతిపాత్రుడవుతాడు, సర్వశుభాలను పొందుతాడు. జ్ఞాపకశక్తి , మంచి తెలివితేటల కోసం పంచదార కలిపిన పాలతో ధారగా శివలింగాన్ని అభిషేకించి, ఆ తీర్థాన్ని స్వీకరించాలి. - శ్రీ శివమహాపురాణం.


expand_less