కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 11 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశిర ఋతువు మాఘ మాసము శుక్ల పక్షం
తిథి: విదియ రా. 1.03 కు తదుపరి తదియ
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: శతభిషం రా. 9.21 కు తదుపరి పూర్వాభాద్ర
యోగం: పరిఘ ఉ. 10.39 కు తదుపరి శివ
కరణం: బాలవ ఉ. 10.57 కు తదుపరి కౌలవ
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 04.44 - 05.30 కు
వర్జ్యం: ఉ. 4.47 - 7.12 కు
అమృతకాలం: మ. 2.40 - 4.09 కు
సూర్యోదయం: ఉ. 6.45 కు
సూర్యాస్తమయం: సా. 6.16 కు
🕉️ శ్యామలానవరాత్రులు 2వ రోజు 🕉️
గురుబోధ:
1) సకలపాపాలను తొలగించే పవిత్రమాసం మాఘమాసం. మాఘం ఇంత అమోఘం అవ్వడానికి గల కారణాలను శ్రీమద్ధేవీభాగవతంలోనూ, బ్రహ్మవైవర్త పురాణంలోనూ వేదవ్యాసుడు వివరించాడు. అఘం అంటే పాపం. దానిని తొలగించేదే మాఘం.
2) మాఘమాసం త్రిమూర్త్యాత్మకమని శాస్త్రాలు చెబుతున్నాయి. మాఘ పూర్ణిమ, అమావాస్య ఈ రెండు తిథులు బ్రహ్మస్వరూపాలనీ, మాఘమాసం శుక్ల పక్షంలో పాడ్యమి మొదలుకుని చతుర్దశి వరకు ఈ 14 రోజులు విష్ణు స్వరూపం. మాఘమాసంలో కృష్ణ పక్షంలో వచ్చే పాడ్యమి నుండి చతుర్దశి వరకు ఉండే తిథులు 14 శివ స్వరూపాలు. ఈ కాలంలో వీలున్నంత వరకు సమయాన్ని త్రిమూర్తుల ధ్యానానికి వాడమన్నారు. దత్తాత్రేయుడిని కనుక మనము స్మరణ చేస్తే ఆయనలో బ్రహ్మ, విష్ణువు, శివుడు ఉన్నారు. "దత్తాత్రేయం సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం" అని మార్కండేయ పురాణములో ఒక శ్లోకం ఉన్నది. అలా దత్తాత్రేయుడిని ధ్యానం చేసినా త్రిమూర్తులను పూజించిన వారు అవుతారు.
3) మాఘమాసం అంతా భక్తిశ్రద్ధలతో స్నానం చేస్తే సర్వతీర్ధములు తిరగడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. మాఘమాసంలో సూర్యోదయానికి కొద్దిగా ముందు సూర్యుడు ఎర్రగా ఉదయించబోతున్నప్పుడు స్నానం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది.
శ్యామలా దండకం👇