Feb 11 2023ఫిబ్రవరి 11 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఫిబ్రవరి 11 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం కృష్ణ పక్షము 

తిథి : షష్ఠి  (12వ తేదీ) తె. 05గం౹౹58ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం :  చిత్త రాత్రి 10గం౹౹29ని౹౹ వరకు తదుపరి స్వాతి
యోగం : శూల  సాయంత్రం 04గం౹౹23ని౹౹ వరకు తదుపరి గండ 
కరణం :  తైతుల ఉదయం 09గం౹౹08ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 06గం౹౹34ని౹౹ నుండి 08గం౹౹05ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 06గం౹౹34ని౹౹ నుండి 07గం౹౹41ని౹౹ వరకు
అమృతకాలం : మధ్యాహ్నం 03గం౹౹54ని౹౹ నుండి 05గం౹౹32ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹34ని౹౹ కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹56ని౹౹ కు

గురుబోధ 
ఏతత్ శివ పురాణం హి శ్లోకం శ్లోకార్థమేవచ | యః పఠేద్భక్తి సంయుక్తః స పాపాన్ముచ్యతే క్షణాత్ || శి.పు. రెం.అ. శ్లో-20 
శివపురాణంలోని ఒక శ్లోకంకాని, లేదా సగం శ్లోకంకాని, భక్తితో చదివినవాడు ఆ క్షణమే పాప విముక్తుడవుతాడు. నిత్యం ఎంతో కొంత చొప్పున ఈ శివపురాణం వినేవాడు జీవన్ముక్తుడనబడతాడు. చదువురానివాడు ఈ గ్రంథాన్ని రోజూ భక్తితో పూజించినా చాలు, అశ్వమేథ యాగఫలం పొందుతాడు. కోరిన కోర్కెలు తీర్చే శివపురాణ గ్రంథానికి భక్తితో నమస్కరించినవానికి, సర్వదేవతలను పూజించిన పుణ్యం లభిస్తుంది. - శ్రీ శివమహాపురాణం.




expand_less