" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 10 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం కృష్ణ పక్షము తిథి : పంచమి రాత్రి 06గం౹౹04ని౹౹ వరకు తదుపరి షష్ఠి వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : హస్త రాత్రి 09గం౹౹51ని౹౹ వరకు తదుపరి చిత్త యోగం : ధృతి సాయంత్రం 04గం౹౹45ని౹౹ వరకు తదుపరి శూల కరణం : బాలవ ఉదయం 07గం౹౹58ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹51ని౹౹ నుండి 09గం౹౹36ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹38ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ వరకు వర్జ్యం : తెల్లవారి 06గం౹౹03ని౹౹ నుండి 07గం౹౹09ని౹౹ వరకు అమృతకాలం : మధ్యాహ్నం 03గం౹౹33ని౹౹ నుండి 05గం౹౹14ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹34ని౹౹ కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹55ని౹౹ కు గురుబోధ పంచమి నాడు మంచి అరటిపళ్ళు (పొడుగ్గా, పెద్దగా చక్కెరకేళి లాంటి అరటిపళ్ళు) తీసుకుని ఇవి అమ్మకి నైవెద్యం పెట్టి, కొన్ని అరటిపళ్ళు అభిషేకం చేయాలి. ఈ పళ్ళు ఎవరికైనా ఒక పండితునికి దానం చేసినవారు మంచి పండితులవుతారు. మంచి తెలివితేటలు వస్తాయి. మీ పిల్లలు ఆడపిల్లలైనా, మగపిల్లలైనా మంచి చదువు రావాలంటే, ప్రతి పంచమికీ మంచి అరటిపళ్ళు శక్త్యానుసారం తెచ్చి అమ్మను అభిషేకించి, నైవేద్యం పెట్టి, అవి పురోహితులవారికి యథాశక్తి దక్షిణతో దానం చెయ్యాలి. - శ్రీ మద్దేవీభాగవతం.