Feb 09 2024ఫిబ్రవరి 09 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 09 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయనం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం

తిథి: చతుర్దశి ఉ.  7.48 కు తదుపరి అమావాస్య
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: శ్రవణం రా.  12.31 కు తదుపరి ధనిష్ఠ
యోగం: వ్యతీపాత రా.  07.07 కు తదుపరి వరీయాన్
కరణం: శకుని ఉ.  08.02 కు తదుపరి చతుష్పాద
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.  09.04 - 09.50 కు & మ.  12.53 - 01.39 కు
వర్జ్యం: తె.  4.16 - 7.06 కు
అమృతకాలం: మ.  2.43 - 4.13 కు
సూర్యోదయం: ఉ.  6.46 కు
సూర్యాస్తమయం: సా.  6.15 కు

🕉️👉చొల్లంగి అమావాస్య, గరుడ జయంతి, వ్యతీపాత యోగం👈🕉️

గురుబోధ:
పూర్ణిమ, అమావాస్య  మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.
శ్రాద్ధం అంటే కేవలం సం౹౹ కి ఒకసారి వచ్చే ఆబ్దికం మాత్రమే కాదు.  ఈ క్రింది సందర్భాల్లో పితృ తర్పణాలు విడిచినా శ్రాద్ధంగా చెప్పబడుతుంది. గ్రహణం విడిచిన తర్వాత, ప్రతి నెలలో వచ్చు సంక్రమణ, వ్యతీపాత యోగం, అమావాస్య తిథి, జన్మ నక్షత్రము నాడు, మొదటి సారి ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకొన్నప్పుడు, పీడ కలలు వచ్చినప్పుడు లేదా గ్రహాల అనుగ్రహం లేనప్పుడు, కష్టాలు తీరడానికి  మొ౹౹ సందర్భాల్లో చనిపోయిన తల్లిదండ్రులని తలచుకొని తర్పణాలు ఇవ్వడం కూడా శ్రాద్ధంగా చెప్పబడుతుంది.

క్రోధి నామ సంవత్సరం కోసం దుఃఖాల నుండి, బాధల నుండి బయటకు వచ్చి వీలున్నంత వరకు సుఖంగా బ్రతకడానికి చతుర్దశి నుండి మొదలుపెట్టవలసిన మంత్రశ్లోకం👇 


పితృదేవతా స్తోత్రం👇


శ్రీ మహావిష్ణు వేదస్తుతి (గాలవ ముని కృతం)👇


expand_less