Feb 09 2023ఫిబ్రవరి 09 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఫిబ్రవరి 09 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం కృష్ణ పక్షము 

తిథి : చతుర్థి  (10వ తేదీ) తె. 05గం౹౹33ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం :  ఉత్తర రాత్రి 08గం౹౹39ని౹౹ వరకు తదుపరి హస్త
యోగం : సుకర్మ  సాయంత్రం 04గం౹౹46ని౹౹ వరకు తదుపరి ధృతి 
కరణం :  బవ రాత్రి 07గం౹౹13ని౹౹ వరకు  తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 10గం౹౹22ని౹౹ నుండి 11గం౹౹07ని౹౹ వరకు & 02గం౹౹54ని౹౹ నుండి 03గం౹౹40ని౹౹ వరకు
వర్జ్యం : తెల్లవారి 05గం౹౹28ని౹౹ నుండి 06గం౹౹34ని౹౹ వరకు
అమృతకాలం : మధ్యాహ్నం 12గం౹౹57ని౹౹ నుండి 02గం౹౹39ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹34ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹55ని౹౹ వరకు

👉🕉️సంకటహర చతుర్థి🕉️👈

గురుబోధ 
గణేశుని అనుగ్రహం కోసం ప్రతిమాసం కృష్ణపక్షం లో వచ్చే చతుర్థిన సంకటహర చతుర్థీ వ్రతం ఆచరిస్తారు.
వారములో కనీసం 3రోజులు ఆలయానికి వెళ్ళేవారు, అక్కడ నిదానంగా భగవంతునిపై మనసు నిలిపి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణ చేసేవారు ఈశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రులవుతారు. మాకు భక్తి కావాలి అనుకొనేవారు తులసీదళాలను ఈశ్వరునికి సమర్పిస్తే తొందరగా భక్తి లభిస్తుంది. - శ్రీ శివమహాపురాణం.  

expand_less