Feb 08 2026ఫిబ్రవరి 08 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 08 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము కృష్ణ పక్షం

తిథి: సప్తమి 9 తె.5.34 కు తదుపరి అష్టమి 9 పూర్తి
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: స్వాతి 9 తె.5.52 కు తదుపరి విశాఖ 9 పూర్తి
యోగం: గండ పూర్తి తదుపరి వృద్ధి 9 రా.12:51 కు
కరణం: విష్టి మ.3:55 కు తదుపరి బాలవ 9 సా.6:13 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 4.40 - 5.25 కు
వర్జ్యం: ఉ.9.52 - 11.37 కు
అమృతకాలం: రా. 07.17 - 09.03 కు
సూర్యోదయం: ఉ. 6.49 కు
సూర్యాస్తమయం: సా. 6.10 కు

🕉️ భానుసప్తమి🕉️

గురుబోధ:
🕉️ఆదివారం మరియు సప్తమీ తిథి సూర్యునికి అత్యంత ప్రీతికరం. ఆ రెండు కలసి ఒకే రోజు వస్తే దానిని భానుసప్తమీ పర్వదినం అంటారు. ఈ రోజు చేసే ఏ కార్యమైనా వేల రెట్ల ఫలితం ఇస్తుంది. పైగా మాఘ మాసం లో ఈ పర్వదినం మరింత విశేష ఫలితం ఇస్తుంది.
🕉️చంపకం (సంపంగి), కేతకం (మొగలి) పువ్వులు తప్ప ఏ పుష్పమైనా శివునికి సమర్పించవచ్చును. నమకచమక సహితంగా శివుని తరచుగా అభిషేకించినవాడు శివునికి ప్రీతిపాత్రుడవుతాడు, సర్వశుభాలను పొందుతాడు. జ్ఞాపకశక్తి , మంచి తెలివితేటల కోసం పంచదార కలిపిన పాలతో ధారగా శివలింగాన్ని అభిషేకించి, ఆ తీర్థాన్ని స్వీకరించాలి. - శ్రీ శివమహాపురాణం.

ఆదిత్య హృదయం👇
https://youtu.be/oVLM-KRgo2E
ఆదిత్య స్తవం 👇
https://youtu.be/ZNuC8HFPBuU

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less