Feb 08 2023ఫిబ్రవరి 08 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఫిబ్రవరి 08 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం కృష్ణ పక్షము 

తిథి : తదియ  (9వ తేదీ) తె. 04గం౹౹36ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం :  పుబ్బ రాత్రి 06గం౹౹59ని౹౹ వరకు తదుపరి ఉత్తర
యోగం : అతిగండ  సాయంత్రం 04గం౹౹31ని౹౹ వరకు తదుపరి సుకర్మ 
కరణం :  వణిజ సాయంత్రం 05గం౹౹27ని౹౹ వరకు  తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11గం౹౹53ని౹౹ నుండి 12గం౹౹39ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 02గం౹౹41ని౹౹ నుండి 04గం౹౹23ని౹౹ వరకు
అమృతకాలం : మధ్యాహ్నం 12గం౹౹02ని౹౹ నుండి 01గం౹౹46ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹35ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹54ని౹౹ వరకు

గురుబోధ 
నాగదేవతామూర్తులు లేదా ఏ ఇతర విగ్రహమూర్తులకు అయినా పాలతో అభిషేకం చేసిన తర్వాత తప్పక నీటితో శుభ్రంగా అభిషేకం చేయాలి.
శ్రీ మద్ధేవీ భాగవతము - నవమ స్కంధం లో ఉన్న ఈ ద్వాదశ నామ మంత్రములను నిత్యం లేదా పర్వదినములలో పఠిస్తే  నాగదోషాలు నశిస్తాయి. వంశంలో చేసిన భయంకర నాగాపచారాలు కూడా తొలగిపోతాయని ఫలశ్రుతి. 
నాగదేవతా నామములు : 1. ఓం జరత్కారు ప్రియాయై నమః , 2. ఓం జగద్గౌర్యై నమః, 3. ఓం సిద్ధయోగిన్యై నమః, 4. ఓం నాగభగిన్యై నమః, 5. ఓం నాగేశ్వర్యై నమః, 6. ఓం విషహరాయై నమః, 7. ఓం జగత్కారవే నమః, 8. ఓం మనసాయై నమః, 9. ఓం వైష్ణవ్యై నమః, 10. ఓం శైవ్యై నమః, 11. ఓం ఆస్తీకమాత్రే నమః, 12. ఓం మహాజ్ఞానయుతాయై నమః


expand_less