కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 07 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము శుక్ల పక్షం
తిథి: దశమి రా.11.21 తదుపరి ఏకాదశి 8 రా.9.33
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: రోహిణి రా.8.32 తదుపరి మృగశిర 8 రా.7.32
యోగం: ఐంద్ర సా.04.16 కు తదుపరి వైధృతి 8 మ. 02.04 కు
కరణం: తైతుల ఉ.10.08 కు తదుపరి గరజి రా.8.26 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 09:06 - 09:51 కు & మ.12.52-1.38 కు
వర్జ్యం: మ.12.52-2.28 కు & రా.1.53-3.24 కు
అమృతకాలం: మ. 03.34-05.07 కు
సూర్యోదయం: ఉ. 6:31 కు
సూర్యాస్తమయం: సా. 5:51 కు
🕉️శ్యామలానవరాత్రులు 9వ రోజు🕉️
గురుబోధ:
1400 జన్మల సంస్కారం, పుణ్యఫలం ఉంటే గాని అష్టాదశ పురాణములు వినలేము. అసలు వినాలన్న ఆలోచన కూడా రాదు. అందరికీ వినే భాగ్యం కలగదని శ్రీ నారదమహాపురాణం చెపుతున్నది.
సకల వేదములు శ్రద్ధతో వినటం వల్ల పారాయణం చేయటం వల్ల ఇతరులకు బోధించడం వల్ల వచ్చే ఫలితం మాఘ మాసం మొత్తం స్నానం చేయటం వల్ల పొందుతారు. స్నానం చేసాక యథాశక్తి దానం చేస్తే మంచిది. ఈశ్వరానుగ్రహం వల్ల అనేక దోషాలనుంచి విముక్తి పొందుతారు. మాఘమాసం అంతా భక్తిశ్రద్ధలతో స్నానం చేస్తే సర్వతీర్ధములు తిరగడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. మాఘ మాసం లో సూర్యోదయానికి కొద్దిగా ముందు సూర్యుడు ఎర్రగా ఉదయించబోతున్నప్పుడు స్నానం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది.