Feb 07 2023ఫిబ్రవరి 07 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఫిబ్రవరి 07 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం కృష్ణ పక్షము 

తిథి : విదియ ఈ రోజు తె. 03గం౹౹07ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం :  మఘ సాయంత్రం 04గం౹౹57ని౹౹ వరకు తదుపరి పుబ్బ
యోగం : శోభన  సాయంత్రం 04గం౹౹03ని౹౹ వరకు తదుపరి అతిగండ
కరణం :  తైతుల మధ్యాహ్నం 03గం౹౹24ని౹౹ వరకు  తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹46ని౹౹ నుండి 09గం౹౹37ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹57ని౹౹ నుండి 11గం౹౹47ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 01గం౹౹37ని౹౹ నుండి 03గం౹౹21ని౹౹ వరకు
అమృతకాలం : మధ్యాహ్నం 02గం౹౹18ని౹౹ నుండి 04గం౹౹03ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹35ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹54ని౹౹ వరకు

గురుబోధ 
శివుని ముఖపద్మం నుండి ధగధగ వెలిగిపోతూ పుట్టిన అపూర్వనగరమే కాశీ. ప్రళయకాలంలో కూడా నాశనం లేకుండా నిత్యం వెలుగుతూ ఉండే స్థలం. ప్రళయంలో తన త్రిశూలాగ్రంపై నిలబెట్టి కాశీని పరమేశ్వరుడు కాపాడుతాడు. అందుకే త్రికంటాగ్రస్థితా (త్రిశూలంలో మధ్యలో ఉన్న మొన పై భాగమున ఉండునది) అని కాశీకి పేరు. అందుకే కాశీలో స్నానం చేసేప్పుడు సంకల్పంలో కాశ్యాం, త్రికంటకాగ్రస్థితాం అంటారు. - శ్రీ శివమహాపురాణం.

శ్లో ౹౹ విశ్వేశం మాధవం డుంఠిమ్ దండపాణిం చ భైరవం ౹
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం ౹౹ - (కాశీఖండం)

కాశీక్షేత్రములోని ప్రధాన దేవతలందరినీ స్మరించుకొనే ధ్యాన శ్లోకము. ప్రతినిత్యం ఈ శ్లోకం తలచుకోవడం వల్ల దేవతల అనుగ్రహం కలిగి కాశీవాస ఫలితం లభిస్తుంది.

expand_less