Feb 06 2024ఫిబ్రవరి 06 2024favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 ఫిబ్రవరి 06 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం కృష్ణపక్షము

తిథి : ఏకాదశి మ. 12గం౹౹06ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : మూల 7వ తేదీ తె. 03గం౹౹32ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం : వ్యాఘాత ఉ. 08గం౹౹50ని౹౹ వరకు తదుపరి హర్షణ
కరణం :  బాలవ సా. 04గం౹౹07ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹04ని౹౹ నుండి 09గం౹౹50ని౹౹ వరకు & రా. 11గం౹౹15ని౹౹ నుండి 12గం౹౹05ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 11గం౹౹42ని౹౹ నుండి 01గం౹౹17ని౹౹ వరకు & రా. 01గం౹౹57ని౹౹ నుండి 03గం౹౹32ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹12ని౹౹ నుండి 10గం౹౹46ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹35ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹54ని౹౹కు

👉🕉️ ఏకాదశి 🕉️👈

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు ఉదయం 11 గం.ల లోపే చేసెయ్యాలి.

గురుబోధ
ఏకాదశి అంటే హరిహరులకు ప్రీతి. ఏకాదశి అంటేనే యమకింకరులు వణికిపోతారు. ఏకాదశి నాడు : 1) ఒక వెయ్యీ ఎనిమిది తులసీదళాలతో, బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించినవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. 2) చామంతిపువ్వులు, తులసీదళాలతో విష్ణువును పూజించినవాడు మంచిపదవిని పొందుతాడు.

శ్రీ వాసుదేవ శత నామాలు👇


expand_less