" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 06 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం కృష్ణ పక్షము తిథి : పాడ్యమి ఈ రోజు రాత్రి 01గం౹౹17ని౹౹ వరకు తదుపరి విదియ వారం : ఇందువారం (సోమవారం) నక్షత్రం : ఆశ్లేష మధ్యాహ్నం 02గం౹౹33ని౹౹ వరకు తదుపరి మఘ యోగం : సౌభాగ్య రాత్రి 03గం౹౹26ని౹౹ వరకు తదుపరి శోభన కరణం : బాలవ మధ్యాహ్నం 01గం౹౹09ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12గం౹౹38ని౹౹ నుండి 01గం౹౹23ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹54ని౹౹ నుండి 03గం౹౹39ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 01గం౹౹45ని౹౹ నుండి 03గం౹౹30ని౹౹ వరకు అమృతకాలం : మధ్యాహ్నం 12గం౹౹46ని౹౹ నుండి 02గం౹౹32ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹35ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹54ని౹౹ వరకు గురుబోధ జగన్నాథపురీ క్షేత్రానికి బ్రహ్మదేవుడు ఏకాదశనామాలు పెట్టాడు. అవి చదివి పడుకుంటే దుఃస్వప్నం సుస్వప్నం అవుతుంది, భయంకర జాతకదోషాలు పోతాయి, ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి, భక్తితో తలచుకొంటే ఏ కష్టాలు ఉండవు. 1) ఉచ్చిష్ట జగన్నాథాయనమః 2) శ్రీ క్షేత్ర జగన్నాథాయనమః 3) శంఖ క్షేత్ర జగన్నాథాయనమః 4) పురుషోత్తమ క్షేత్ర జగన్నాథాయనమః 5) నీలాద్రి జగన్నాథాయనమః 6) ఉద్యాన పీఠ జగన్నాథాయనమః 7) మర్త్య వైకుంఠ జగన్నాథాయనమః 8) యవనికాతీర్థ జగన్నాథాయనమః 9) ఓం కుశస్థలీ జగన్నాథాయనమః 10) పురీక్షేత్ర జగన్నాథాయనమః 11) శ్రీ జగన్నాథ జగన్నాథాయనమః