Feb 05 2024ఫిబ్రవరి 05 2024favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 ఫిబ్రవరి 05 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం కృష్ణపక్షము

తిథి : దశమి మ. 12గం౹౹41ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం : జ్యేష్ఠ 6వ తేదీ తె. 03గం౹౹49ని౹౹ వరకు తదుపరి మూల
యోగం : ధ్రువ ఉ. 10గం౹౹52ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత
కరణం :  విష్టి సా. 05గం౹౹24ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹53ని౹౹ నుండి 01గం౹౹39ని౹౹ వరకు & మ. 03గం౹౹10ని౹౹ నుండి 03గం౹౹56ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 09గం౹౹17ని౹౹ నుండి 10గం౹౹53ని౹౹ వరకు
అమృతకాలం : రా. 07గం౹౹03ని౹౹ నుండి 08గం౹౹40ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹36ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹54ని౹౹కు

గురుబోధ
అగస్త్యమహర్షిని రాత్రి పడుకునే ముందు తలుచుకొని పడుకుంటే దుస్స్వప్నాలు రావు, అపమృత్యుభయం ఉండదు, యమభయం ఉండదు. అగస్త్యుడు దక్షిణం దిక్కున నిలబడి రాత్రిపూట యమభయం, మృత్యుభయం లేకుండా చేస్తాడు. పూర్వం కొత్తగా వాహనములు తీసుకున్నప్పుడు అగస్త్యమహర్షిని తలుచుకొని, ప్రదక్షిణ చేసి అందులో ప్రయాణం చేసేవారు. ఇంటిలో నుండి బయటకు ప్రయాణమై వెళ్లేటప్పుడు అగస్త్య మహర్షికి నమస్కారము చేసుకొని (ముమ్మారు అగస్త్యం నమామి అనుకొని) ప్రయాణానికి వెళ్తే అటువంటి వారికి యాక్సిడెంట్ భయం ఉండదు.

expand_less