" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 05 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం శుక్ల పక్షము తిథి : పూర్ణిమ ఈ రోజు రాత్రి 11గం౹౹13ని౹౹ వరకు తదుపరి పాడ్యమి వారం : భానువారం (ఆదివారం) నక్షత్రం : పుష్యమి ఉదయం 11గం౹౹58ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష యోగం : ఆయుష్మాన్ మధ్యాహ్నం 02గం౹౹42ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య కరణం : విష్టి ఉదయం 10గం౹౹44ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : సాయంత్రం 04గం౹౹23ని౹౹ నుండి 05గం౹౹09ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 02గం౹౹39ని౹౹ నుండి 04గం౹౹25ని౹౹ వరకు అమృతకాలం : లేదు సూర్యోదయం : ఉ. 06గం౹౹36ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹53ని౹౹ 🕉️👉మాఘపూర్ణిమ - శ్రీప్రణవపీఠ దశమ వార్షికోత్సవములు👈🕉️ రేపు ఉదయం 8 గంటల నుంచి పల్లకీ సేవ, అమ్మవార్లకు అభిషేకములు, శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారికి స్వర్ణ కవచంతో అలంకరణ, ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు ఉంటాయి. గురుబోధ మాఘపూర్ణిమ --> ద్వాపరయుగం ఆరంభమైన పుణ్యతిథి. ఈ తిథినాడు ఏదైనా ఆలయాన్ని ప్రతిష్ఠిస్తే, ప్రతిష్ఠ చేసినవారు, వారి వారసులు, ఆ కార్యక్రమానికి వెళ్ళినవారు ఈ జన్మలోనే ముక్తి పొందుతారు.- శ్రీ స్కాందపురాణం - కౌమారికా ఖండము శ్రీప్రణవపీఠంలో త్రిమాతల ప్రతిష్ఠ , అలాగే అనేక దేవతా మూర్తుల ప్రతిష్ఠ జరిగినది కూడా ఈరోజే. ఇదే రోజున 2023 ఫిబ్రవరి 4,5 తేదీలలో ధ్వజ స్తంభం, సింహ వాహనం, బలి పీఠం ప్రతిష్ఠ జరుగుతున్నాయి. ఈ తిథులలో చేసే అల్పదానమైనా అనల్పమవుతుంది, అక్షయమవుతుంది, అత్యంత పుణ్యప్రదం. ఎంతోకొంత తమ శక్తిని బట్టి దానం చేస్తే జీవితంలో ఏ లోటు రాదు.