Feb 04 2023ఫిబ్రవరి 04 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఫిబ్రవరి 04 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం శుక్ల పక్షము

తిథి : చతుర్దశి ఈ రోజు రాత్రి 08గం౹౹59ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం :  పునర్వసు ఉదయం 09గం౹౹21ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం : ప్రీతి  మధ్యాహ్నం 01గం౹౹53ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం :  గరజి ఉదయం 08గం౹౹14ని౹౹ వరకు  తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 06గం౹౹36ని౹౹ నుండి 08గం౹౹07ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 06గం౹౹13ని౹౹ నుండి 08గం౹౹00ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 06గం౹౹42ని౹౹ నుండి 08గం౹౹28ని౹౹ వరకు & తెల్లవారి 04గం౹౹52ని౹౹ నుండి 06గం౹౹38ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹36ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹33ని౹౹


🕉️👉శ్రీప్రణవపీఠ దశమ వార్షికోత్సవములు👈🕉️

గురుబోధ 
మాఘపూర్ణిమ‌ --> ద్వాపరయుగం ఆరంభమైన పుణ్య తిథి. ఈ తిథినాడు ఏదైనా ఆలయాన్ని ప్రతిష్ఠిస్తే, ప్రతిష్ఠ చేసినవారు, వారి వారసులు, ఆ కార్యక్రమానికి వెళ్ళినవారు ఈ జన్మలోనే ముక్తి పొందుతారు.- స్కాందపురాణం - కౌమారికా ఖండము

శ్రీప్రణవపీఠంలో త్రిమాతల ప్రతిష్ఠ , అలాగే అనేక దేవతా మూర్తుల ప్రతిష్ఠ జరిగినది కూడా ఈరోజే. ఇదే రోజున 2023 ఫిబ్రవరి 4,5 తేదీలలో ధ్వజ స్తంభం, సింహ వాహనం, బలి పీఠం ప్రతిష్ఠ జరుగుతున్నాయి.

ఈ తిథులలో చేసే అల్పదానమైనా అనల్పమవుతుంది, అక్షయమవుతుంది, అత్యంత పుణ్యప్రదం. ఎంతోకొంత తమ శక్తిని బట్టి దానం చేస్తే జీవితంలో ఏ లోటు రాదు. 


expand_less