Feb 03 2025ఫిబ్రవరి 03 2025favorite_border

"కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 03 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము శుక్ల పక్షం

తిథి: పంచమి ఉ.10.24 కు తదుపరి షష్ఠి 4 ఉ.7.58 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: రేవతి రా.2.46 కు తదుపరి అశ్వని 4 రా.12.52 కు
యోగం: సాధ్య 4 తె.3.02 కు తదుపరి శుభ 5 రా.12.06 కు
కరణం: కౌలవ సా.5.44 కు తదుపరి తైతుల
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12.52 - 01.37 కు, మ.03.07 - 03.53 కు
వర్జ్యం: మ.3.32 - 5.02 కు
అమృతకాలం: మ. 3:03 - 4:33 కు
సూర్యోదయం: ఉ. 6:31 కు
సూర్యాస్తమయం: సా. 5:51 కు

🕉️ మాఘశుద్ధపంచమి, శ్రీ పంచమి, సరస్వతీ పంచమి🕉️

గురుబోధ:
శ్రీకృష్ణుడు మాఘ శుక్లపంచమి నాడు సరస్వతీ పూజా విధానం లోకానికి అందించడమే కాక సరస్వతీ కవచాన్ని కూడా వ్రాసి భక్తులకు అందించాడు. సరస్వతీ కవచ పఠనం వల్ల మూర్ఖుడు కూడా పండితుడవుతాడని దేవీభాగవతం చెపుతున్నది. సరస్వతీమాత బ్రహ్మ, విష్ణువు, శివుడు త్రిమూర్తులతో పూజింపబడుతుంది. మనలో ఉన్న మందకొడితనాన్ని పూర్తిగా తొలగిస్తుంది. అమ్మవారికి పుష్పములు సమర్పించి ధూపము ఇవ్వాలి. ధూపము వల్ల సంపదలు వస్తాయి. ఆ తరువాత దీపం చూపించి నైవేద్యం పెట్టాలి. ఇది అయ్యాక కవచం చదివి లేదా అష్టోత్తర శతనామములు లేదా కనీసం ఈ క్రింది 5 నామములతో పూజించండి.
1. ఓం సరస్వత్యై నమః
2. ఓం వాగ్దేవ్యై నమః
3. ఓం వాణ్యైనమః
4. ఓం బ్రహ్మ రాజ్ఞ్యై నమః
5. ఓం బ్రహ్మణ్యై నమః
ఆలయ ప్రదక్షిణ వల్ల కష్టములు నశిస్తాయి. తల్లికి ప్రదక్షిణ చేస్తే భయంకర దోషాలు పోతాయి. మహా తపస్సు చేసిన ఫలితం పొందుతారు.
సరస్వతీకవచం👇
https://youtu.be/27tV-fDbMec?si=mserODQYoerv7jzy
https://youtu.be/q8czyMJzLqA?si=twmPbNLo4ClvwPmO
https://srivaddipartipadmakar.org/stotram/sri-saraswati-armor/

expand_less