" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 03 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం శుక్ల పక్షము తిథి : త్రయోదశి ఈ రోజు సాయంత్రం 06గం౹౹54ని౹౹ వరకు తదుపరి చతుర్దశి వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : ఆర్ద్ర ఉదయం 06గం౹౹54ని౹౹ వరకు తదుపరి పునర్వసు యోగం : విష్కంభ మధ్యాహ్నం 01గం౹౹02ని౹౹ వరకు తదుపరి ప్రీతి కరణం : తైతుల సాయంత్రం 06గం౹౹57ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹52ని౹౹ నుండి 09గం౹౹37ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹37ని౹౹ నుండి 01గం౹౹23ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 08గం౹౹07ని౹౹ నుండి 09గం౹౹57ని౹౹ వరకు అమృతకాలం : లేదు సూర్యోదయం : ఉ. 06గం౹౹36ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹32ని౹౹ గురుబోధ నవగ్రహ దేవతలు కాశీ లో గొప్ప తపస్సు చేసి తమపేరు మీద లింగాన్ని ప్రతిష్ఠించి గ్రహాధిపత్యం పొందారు. మన పూర్వజన్మ పుణ్యపాప కర్మలను అనుసరించి మాత్రమే తగిన శుభ లేదా అశుభ ఫలితాలని ఇస్తారు. వారిని నిత్యం స్మరించడం, ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పక ప్రదక్షిణ, నమస్కారాలు చేసాక మాత్రమే ప్రధాన దేవతామూర్తిని దర్శించాలని శాస్త్రం చెపుతున్నది.