Feb 02 2024ఫిబ్రవరి 02 2024favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 ఫిబ్రవరి 02 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం కృష్ణపక్షము

తిథి : సప్తమి ఉ. 11గం౹౹29ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం : స్వాతి రా. 01గం౹౹49ని౹౹ వరకు తదుపరి విశాఖ
యోగం : శూల మ. 12గం౹౹55ని౹౹ వరకు తదుపరి గండ
కరణం :  బవ సా. 04గం౹౹02ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹05ని౹౹ నుండి 09గం౹౹50ని౹౹ వరకు & మ. 12గం౹౹53ని౹౹ నుండి 01గం౹౹38ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 06గం౹౹53ని౹౹ నుండి 08గం౹౹37ని౹౹ వరకు
అమృతకాలం : సా. 04గం౹౹31ని౹౹ నుండి 06గం౹౹13ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹31ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹51ని౹౹కు

గురుబోధ
తపః శక్తి కలిగినవాడికి వార్ధక్యం రాదు. జరా, మరణము పొందకుండా ఉండాలంటే మనము కూడా సాధకులం కావాలి. కొన్ని నియమాలను పాటిస్తే జరామరణాలను జయించవచ్చు. సోమరితనము ఉండకూడదు, సంధ్యా సమయానికి శుచిగా స్నానం చేసి సంధ్యావందనాలు చేయాలి.
శుచి, పవిత్రం అయిన ఆహారము భగవంతుడికి నివేదన చేసి తీసుకోవాలి. అన్నం తినేటప్పుడు మాట్లాడకుండా మౌనంగా తినాలి అందుకనే దేవతానివేదన కోసం అన్నం వండేటప్పుడు పూర్వం మూతికి గుడ్డ కట్టుకునే వాళ్ళు. ఇతరులను ప్రేమగా చూడటం, రాగద్వేషాలకు అతీతంగా ఉండడం, ఇతరుల యొక్క దోషాల గురించి చెప్పకపోవడం, అలాగే ఇతరుల దోషాలు వినకపోవడం అనేవి సాధనలో ఉన్నవారు పాటించవలసిన లక్షణాలు.

expand_less