" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 02 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం శుక్ల పక్షము తిథి : ద్వాదశి ఈ రోజు సాయంత్రం 05గం౹౹03ని౹౹ వరకు తదుపరి త్రయోదశి వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : ఆర్ద్ర పూర్తిగా ఉంది యోగం : వైధృతి మధ్యాహ్నం 12గం౹౹13ని౹౹ వరకు తదుపరి విష్కంభ కరణం : బాలవ సాయంత్రం 04గం౹౹26ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 10గం౹౹22ని౹౹ నుండి 11గం౹౹07ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹52ని౹౹ నుండి 03గం౹౹37ని౹౹ వరకు వర్జ్యం : మధ్యాహ్నం 01గం౹౹47ని౹౹ నుండి 03గం౹౹32ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 07గం౹౹56ని౹౹ నుండి 09గం౹౹41ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹36ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹52ని౹౹ ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈరోజు ఉదయం చేయవచ్చును. గురుబోధ క్షేత్రాలను, నదులను, గురువులను, మహాత్ములను నిందించరాదు. ఆధ్యాత్మిక గ్రంథాలు, కథలు, పురాణ విశేషాలు ప్రామాణికమైన పుస్తకము లేదా అన్నీ పురాణములు తెలిసిన సద్గురువుల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని శాస్త్రం.