కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 01 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము శుక్ల పక్షం
తిథి: పూర్ణిమ 2 తె.4.17 కు తదుపరి బ.పాడ్యమి 3 తె.3.02 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పుష్యమి రా.12.48 కు తదుపరి ఆశ్లేష 2 రా.12.09 కు
యోగం: ఆయుష్మాన్ ఉ.7:20 కు తదుపరి సౌభాగ్య 2 తె.4:45 కు
కరణం: విష్టి సా.4:43 కు తదుపరి బాలవ 2 మ.2:42 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 4.37 - 5.22 కు
వర్జ్యం: ఉ.9.27 - 10.59 కు
అమృతకాలం: సా. 5.59 - 07.28 కు
సూర్యోదయం: ఉ. 6.51 కు
సూర్యాస్తమయం: సా. 6.07 కు
🕉️ మాఘపూర్ణిమ, ఏలూరులో శ్రీ ప్రణవపీఠం 13వ వార్షికోత్సవాలు ఆఖరిదినము మహామాఘీ, సంత్ రవిదాస్ జయంతి🕉️
గురుబోధ:
🕉️శ్రీ లలితాదేవి ఒక కల్పంలో అవతరించిన రోజుగా మాఘ పూర్ణిమను భావిస్తారు. మాఘపూర్ణిమ రోజు లలితాదేవి ఆరాధన విశేష శుభఫలితాలను ప్రసాదిస్తుంది. పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.
🕉️మాఘపూర్ణిమ - ద్వాపరయుగం ఆరంభమైన పుణ్యతిథి. ఈ తిథినాడు ఏదైనా ఆలయాన్ని ప్రతిష్ఠిస్తే, ప్రతిష్ఠ చేసినవారు, వారి వారసులు, ఆ కార్యక్రమానికి వెళ్ళినవారు ఈ జన్మలోనే ముక్తి పొందుతారు.- శ్రీ స్కాందపురాణం - కౌమారికా ఖండము
🕉️శ్రీప్రణవపీఠంలో త్రిమాతల ప్రతిష్ఠ, అలాగే అనేక దేవతా మూర్తుల ప్రతిష్ఠ జరిగినది కూడా ఈరోజే. ఇదే రోజున 2022లో శ్రీ కృష్ణుడు, కాలభైరవులను పీఠంలో ప్రతిష్ఠించారు. 2023 ఫిబ్రవరి 4,5 తేదీలలో ధ్వజస్తంభం, సింహవాహనం, బలిపీఠం ప్రతిష్ఠ జరిగాయి. 2024 ఫిబ్రవరి 24వ తేదీన శ్రీ రమాసమేత శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీ ఆంజనేయస్వామి వారల ప్రతిష్ఠలు కూడా జరిగాయి. మాఘపూర్ణిమ రోజున చేసే అల్పదానమైనా సరే, అది అక్షయమై, అనంతమైన పుణ్యాలను ప్రసాదిస్తుంది. జీవితంలో ఎటువంటి లోటూ రాకుండా గురు, దైవ కటాక్షాలను అందిస్తుంది.
శ్రీ లలితా త్రిశతి👇
https://youtu.be/FS-o_aSJRd0?si=4MJ-KpFBswPdM_8d
పిడిఎఫ్ - https://srivaddipartipadmakar.org/stotram/sri-lalita-trisati/
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్👇
https://youtu.be/reVyMzCbdpE?si=nbla4kXSUCzYJReQ
పిడిఎఫ్ - https://srivaddipartipadmakar.org/stotram/sri-lalita-sahasranama-stotram/
శ్రీ లలితా స్తోత్రమ్👇
https://youtu.be/9zWYH8_jrkM?si=7mLSoSqxGfzvXq0i
పిడిఎఫ్ -https://srivaddipartipadmakar.org/stotram/sri-lalita-stotram-brahmanda-puranam/pcatid/108/
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial