"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 01 2024 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం కృష్ణపక్షము తిథి : షష్ఠి ఉ. 10గం౹౹07ని౹౹ వరకు తదుపరి సప్తమి వారం : బృహస్పతివారము (గురువారం) నక్షత్రం : చిత్త రా. 12గం౹౹11ని౹౹ వరకు తదుపరి స్వాతి యోగం : ధృతి మ. 12గం౹౹28ని౹౹ వరకు తదుపరి శూల కరణం : వణిజ మ. 02గం౹౹03ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 10గం౹౹36ని౹౹ నుండి 11గం౹౹21ని౹౹ వరకు & మ. 03గం౹౹09ని౹౹ నుండి 03గం౹౹55ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 06గం౹౹53ని౹౹ నుండి 08గం౹౹37ని౹౹ వరకు అమృతకాలం : సా. 05గం౹౹18ని౹౹ నుండి 07గం౹౹02ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹31ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹51ని౹౹కు గురుబోధ రావిచెట్టుకు ఒకసారి ప్రదక్షిణ చేస్తే "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరీ మంత్రమును 108 సార్లు జపం చేసిన ఫలితం పొందుతారు అదే 3 సార్లు ప్రదక్షిణ చేస్తే 1008 సార్లు అష్టాక్షరీ మంత్రజపం చేసిన ఫలితం పొందుతారు. మఱ్ఱిచెట్టుకు ప్రదక్షిణ చేస్తే ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా అనే కృష్ణమంత్రం జపం చేసిన ఫలితం వస్తుంది. ఇంటిలో కడిమి చెట్టు (కదంబవృక్షం) పెట్టుకొని దానికి ప్రదక్షిణ చేస్తే నిత్యం లలితా సహస్రనామం, బాలామంత్రం, పంచదశీ మహామంత్రం, షోడశాక్షరీ మంత్రం జపం చేసిన ఫలితం పొందవచ్చు. మేడిచెట్టుకు (ఔదుంబర వృక్షము) ప్రదక్షిణ చేస్తే అమ్మవారి యొక్క నవార్ణ మంత్రమును నిత్యం అనుష్ఠానం చేసిన ఫలితం పొందుతారు. జిల్లేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే సూర్య భగవానుడిని అనుష్ఠానం చేసిన ఫలితం పొందవచ్చు.