Feb 01 2023ఫిబ్రవరి 01 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఫిబ్రవరి 01 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం శుక్ల పక్షము

తిథి : ఏకాదశి ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹36ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం :  మృగశిర 02వ తేదీ తెల్లవారి 04గం౹౹35ని౹౹ వరకు తదుపరి ఆర్ద్ర
యోగం : ఐంద్ర  ఉదయం 11గం౹౹30ని౹౹ వరకు తదుపరి వైధృతి
కరణం :  విష్టి మధ్యాహ్నం 02గం౹౹01ని౹౹ వరకు  తదుపరి బవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11గం౹౹52ని౹౹ నుండి 12గం౹౹37ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 08గం౹౹47ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 07గం౹౹07ని౹౹ నుండి 08గం౹౹50ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 06గం౹౹31ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹51ని౹౹


🕉️👉భీష్మ ఏకాదశి👈🕉️

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు ఉదయం చేయవచ్చును.


గురుబోధ 
మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. భీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం శ్రీ విష్ణు సహస్రనామం. పరమపవిత్రమైన భీష్మ ఏకాదశి నాడు శ్రీ విష్ణుసహస్రనామం, శ్రీ మద్భగవద్గీత లేక ఏదైనా విష్ణుస్తోత్రమును పారాయణం చెయ్యడం వలన విశేష ఫలితం లభించి సకల శుభాలు ప్రాప్తిస్తాయి.

expand_less