December 29 2022డిసెంబర్ 29 2022favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 డిసెంబర్ 29 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
పుష్యమాసం శుక్లపక్షము

తిథి : సప్తమి రాత్రి 12గం౹౹57ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : బృహస్పతివారం  (గురువారం)  
నక్షత్రం : పూర్వాభాద్ర  సాయంత్రం 05గం౹౹46ని౹౹  వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం :  వ్యతీపాత ఉదయం 11గం౹౹46ని౹౹ వరకు తదుపరి వరీయాన్
కరణం :  గరజి ఈ రోజు ఉదయం 07గం౹౹55ని౹౹ వరకు తదుపరి  వణిజ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 10గం౹౹11ని౹౹ నుండి 10గం౹౹55ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹35ని౹౹ నుండి 03గం౹౹19ని౹౹ వరకు
వర్జ్యం : తెల్లవారి 03గం౹౹04ని౹౹ నుండి 04గం౹౹37ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 10గం౹౹10ని౹౹ నుండి 11గం౹౹41ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹33ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹31ని౹౹ 

👉🕉️వ్యతీపాత యోగం🕉️👈

గురుబోధ
శ్రాద్ధం అంటే కేవలం సం౹౹ కి ఒకసారి వచ్చే ఆబ్దికం మాత్రమే కాదు.  ఈ క్రింది సందర్భాల్లో పితృ తర్పణాలు విడిచినా శ్రాద్ధంగా చెప్పబడుతుంది. గ్రహణం విడిచిన తర్వాత, ప్రతి నెలలో వచ్చు సంక్రమణ, వ్యతీపాత యోగం, జన్మ నక్షత్రము నాడు, మొదటి సారి ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకొన్నప్పుడు, పీడకలలు వచ్చినప్పుడు లేదా గ్రహాల అనుగ్రహం లేనప్పుడు, కష్టాలు తీరడానికి మొ౹౹ సందర్భాల్లో చనిపోయిన తల్లిదండ్రులని తలచుకొని తర్పణాలు ఇవ్వడం కూడా శ్రాద్ధంగా చెప్పబడుతుంది.

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే స్కాందపురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో 2023 జనవరి 01వ తేదీ ఆదివారం నుండి 2023 జనవరి 8వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less