"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 29 2021🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణ పక్షము తిథి: దశమి ఈ రోజు ఉదయం 11గం౹౹41ని౹౹ ఉంది తరువాత ఏకాదశి వారం : సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం: స్వాతి ఈ రోజు రాత్రి 11గం౹౹10ని౹౹ వరకు తదుపరి విశాఖ యోగం: సుకర్మ ఈ రోజు పూర్తిగా ఉంది కరణం : విష్టి ఈ రోజు సాయంత్రం 04గం౹౹12ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹39ని౹౹ నుండి 12గం౹౹23ని౹౹ వరకు వర్జ్యం: ఉదయం 05గం౹౹56ని౹౹ నుండి 07గం౹౹12ని౹౹ వరకు & (30) తెల్లవారి 04గం౹౹26ని౹౹ నుండి 05గం౹౹56ని౹౹ వరకు అమృతకాలం: మధ్యాహ్నం 02గం౹౹48ని౹౹ నుండి 04గం౹౹19ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹33ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹31ని౹౹ వరకు గురుబోధ:* నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణకథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగచేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు).