"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 25 2021🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణ పక్షము తిథి: షష్ఠి ఈ రోజు సాయంత్రం 04గం౹౹01ని౹౹ ఉంది తరువాత సప్తమి వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం: పుబ్బ ఈ రోజు రాత్రి 01గం౹౹44ని౹౹ వరకు తదుపరి ఉత్తర యోగం: ప్రీతి ఈ రోజు ఉదయం 11గం౹౹26ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్ కరణం : గరజి ఈ రోజు ఉదయం 07గం౹౹56ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹30ని౹౹ నుండి 11గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 07గం౹౹08ని౹౹ నుండి 07గం౹౹57ని౹౹ వరకు వర్జ్యం: ఉదయం 09గం౹౹27ని౹౹ నుండి 11గం౹౹04ని౹౹ వరకు అమృతకాలం: రాత్రి 07గం౹౹13ని౹౹ నుండి 08గం౹౹50ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹31ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹28ని౹౹ వరకు 🕉️పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణ ప్రవచనం లోని రెండవభాగం (21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26 వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్ (LB Nagar) హైదరాబాద్ లో జరుగుతోంది🕉️. గురుబోధ: తిలలు(నువ్వులు) విష్ణువు చెమటనుండి, దర్భలు రోమాల నుండి పుట్టినవి. అందుకే దేవ,పితృకార్యాలకు తిలలకు, దర్భలకు అంత ప్రాధాన్యము ఉంటుంది. వీటిని వినియోగించడం వలన అసురులు, దానవులు, దైత్యులు పారిపోతారు. - శ్రీ గరుడపురాణం*(ధర్మకాండము)