December 23 2023డిసెంబరు 23 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 డిసెంబరు 23 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం శుక్లపక్షము

తిథి : ఏకాదశి  ఉ. 07గం౹౹56ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : భరణి రా. 10గం౹౹08ని౹౹ వరకు తదుపరి కృత్తిక
యోగం : శివ ఉ. 09గం౹౹08ని౹౹ వరకు తదుపరి సిద్ధ
కరణం :  విష్టి ఉ. 07గం౹౹11ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 06గం౹౹30ని౹౹ నుండి 07గం౹౹56ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 08గం౹౹15ని౹౹ నుండి 09గం౹౹47ని౹౹ వరకు
అమృతకాలం : సా. 05గం౹౹30ని౹౹ నుండి 07గం౹౹02ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹30ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹27ని౹౹కు

🕉️ మార్గశిర శుద్ధ ఏకాదశి - గీతాజయంతి, ముక్కోటిఏకాదశి, వైకుంఠఏకాదశి 🕉️

ఏకాదశీ ఉపవాసం ఈ రోజున ఉండాలి.
ద్వాదశీ పారణము ఆదివారం 24వ తేదీ ఉ.6గం.30నిల లోపు చెయ్యాలి.

సంపూర్ణ భగవద్గీత శ్లోక పారాయణము👇


శ్రీ వాసుదేవ శతనామాలు (100) 👇


గురుబోధ
నారాయణుడు పాలసముద్రంలో కార్తికమాసం శుక్లపక్ష ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. లేచాక మార్గశిర శుక్ల ఏకాదశి వరకు లోక పోషణ కొరకు సంచారం చేస్తాడు‌. ఆ  సమయంలో ఆయనని ఆరాధించి, ఉపాసన చేసిన వాళ్ళని రక్షించడం కోసం వైకుంఠం విడిచి, ఒక రూపం ధరించి వైకుంఠానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి 7 ద్వారాలు తెరుచుకుని బయటకు వస్తాడు. అలా లోకరక్షణ కొరకు బయటకు వచ్చే తిథి కనుకే  వైకుంఠ ఏకాదశి అని అంటారు.
మార్గశీర్ష శుద్ధ ఏకాదశి - గీతాజయంతి నాడు భగవద్గీతాపారాయణము (లేదా) శ్రవణము చేసినవారికి “లక్షగోవులను (1,00,000) దానం చేసిన పుణ్యం, కురుక్షేత్రంలో 5 బారుల బంగారం (30 కి.గ్రా) దానము చేసిన పుణ్యం మఱియు కాశీక్షేత్రంలో ఒక ఎకరము భూదానం చేసిన పుణ్యం కలుగుతుందని శాస్త్రం.”



పూజ గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ప్రవచనం చేస్తున్న 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణంలో చివరి భాగం కాశీఖండం పదిరోజుల ప్రవచనం భాగ్యనగరంలో జరుగుతున్నది.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less