"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 17 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం శుక్లపక్షము తిథి: చతుర్దశి ఈ రోజు పూర్తిగా ఉంది వారం : భృగువారము (శుక్రవారం) నక్షత్రం: కృత్తిక ఈ రోజు ఉదయం 11గం౹౹01ని౹౹ వరకు తదుపరి రోహిణి యోగం: సిద్ధ ఈ రోజు ఉదయం 08గం౹౹14ని౹౹ వరకు తదుపరి సాధ్య కరణం : గరజి ఈ రోజు సాయంత్రం 06గం౹౹02ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹38ని౹౹ నుండి 09గం౹౹22ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹18ని౹౹ నుండి 01గం౹౹02ని౹౹ వరకు వర్జ్యం: లేదు అమృతకాలం ఉదయం 08గం౹౹22ని౹౹ నుండి 10గం౹౹07ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹26ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹25ని౹౹ వరకు 🕉️పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణ ప్రవచనం లోని రెండవభాగం (21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26 వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్ (LB Nagar) హైదరాబాద్ లో జరుగుతోంది🕉️. గురుబోధ దశదానములు మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ తమకోసము లేదా తమ ప్రీతిపాత్రులైన వారికోసం ఈ దశదానములు తప్పక చేయాలని శాస్త్రం. అన్నీ చేయలేకపోతే స్తోమత బట్టి వాటిలో కొన్ని అయినా చేయాలని శాస్త్రము శ్లో౹౹ గోభూతిల హిరణ్యాజ్య వాసోధాన్య గుడాస్తథా రజతం లవణం చైవ దానాని దశవై విదు: ౹౹ -గరుడపురాణం(ధర్మకాండము) 1. గోవులు 2. భూమి 3.తిలలు 4. హిరణ్యం 5. ఘృతము 6 వస్త్రం 7. ధాన్యం 8.బెల్లం 9. వెండి 10. ఉప్పు