December 16 2021డిసెంబర్ 16 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 16 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం శుక్లపక్షము

 తిథి: త్రయోదశి  ఈ రోజు తెల్లవారి 04గం౹౹21ని౹౹ వరకు చతుర్దశి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం:  భరణి ఈ రోజు ఉదయం 08గం౹౹40ని౹౹ వరకు తదుపరి కృత్తిక
యోగం: శివ ఈ రోజు ఉదయం 07గం౹౹18ని౹౹ వరకు తదుపరి సిద్ధ
కరణం  : కౌలవ  ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹20ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం
01గం౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 10గం౹౹05ని౹౹ నుండి 10గం౹౹49ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹14ని౹౹ వరకు
వర్జ్యం: రాత్రి 09గం౹౹50ని౹౹ నుండి 11గం౹౹35ని౹౹ వరకు 
అమృతకాలం లేదు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹26ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹25ని౹౹ వరకు 

🕉️పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణ ప్రవచనం లోని  రెండవభాగం (21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26 వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్ (LB Nagar) హైదరాబాద్ లో జరుగుతోంది🕉️.

గురుబోధ

 చనిపోయిన వ్యక్తి నోటిలో పంచరత్నములు వేయాలి.   వీటిని ఉంచడం అనగా  విత్తనములు నాటుట తో సమానం. పంచరత్నములు అనగా 1.బంగారం 2. వెండి 3. ముత్యము 4. నీలము 5. పగడం
(శ్రీ గరుడపురాణం, ధర్మకాండము)
expand_less