December 14 2021డిసెంబర్ 14 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 14 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం శుక్లపక్షము

 తిథి: ఏకాదశి  ఈ రోజు రాత్రి 01గం౹౹09ని౹౹ వరకు తదుపరి  ద్వాదశి  (15) బుధవారం రాత్రి 02గం౹౹31ని౹౹ వరకు
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం:  అశ్విని ఈ రోజు పూర్తిగా ఉంది
యోగం: పరిఘ ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  : వణిజ  ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం
03గం౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹28ని౹౹ నుండి 09గం౹౹20ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹34ని౹౹ నుండి 11గం౹౹25ని౹౹ వరకు
వర్జ్యం: రాత్రి 02గం౹౹24ని౹౹ నుండి 04గం౹౹07ని౹౹ వరకు 
అమృతకాలం రాత్రి 10గం౹౹58ని౹౹ నుండి 12గం౹౹41ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹25ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹23ని౹౹ వరకు 

🕉️పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణ ప్రవచనం లోని  రెండవభాగం (21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26 వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్ (LB Nagar) హైదరాబాద్ లో జరుగుతోంది🕉️.

👉🏻🕉️ గీతాజయంతి & ఏకాదశి 🕉️

ఏకాదశీ ఉపవాసం రేపు ఉండాలి, ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ బుధవారం ఉదయం చేయాలి

గురుబోధ

గీతాజయంతి నాడు భగవద్గీతాపారాయణము లేదా శ్రవణము చేసినవారికి లక్షగోవులను దానం చేసిన పుణ్యం, కురుక్షేత్రంలో 5 బారుల బంగారం (30 కి.గ్రా) దానము చేసిన పుణ్యం మఱియు కాశీక్షేత్రంలో ఒక ఎకరము భూదానం చేసిన పుణ్యం కలుగుతుందని శాస్త్రం.
expand_less