December 12 2021డిసెంబర్ 12 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 12 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం శుక్లపక్షము

తిథి: నవమి  ఈ రోజు రాత్రి 11గం౹౹47ని౹౹ వరకు తదుపరి  దశమి 
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం:  ఉత్తరాభాద్ర ఈ రోజు తెల్లవారి 03గం౹౹56ని౹౹ వరకు తదుపరి రేవతి
యోగం: వ్యతీపాత ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  : బాలవ  ఈ రోజు ఉదయం 07గం౹౹32ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు సాయంత్రం
04గం౹00ని౹౹ నుండి 05గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు మధ్యాహ్నం 03గం౹౹57ని౹౹ నుండి 04గం౹౹41ని౹౹ వరకు 
వర్జ్యం: మధ్యాహ్నం 01గం౹౹10ని౹౹ నుండి 02గం౹౹48ని౹౹ వరకు 
అమృతకాలం రాత్రి 11గం౹౹00ని౹౹ నుండి 12గం౹౹38ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹24ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹23ని౹౹ వరకు 

🕉️పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణ ప్రవచనం లోని రెండవభాగం ( 21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26 వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్(LB Nagar) హైదరాబాద్ లో జరుగుతోంది🕉️.

గురుబోధ

శరీరం విడిచిపెట్టిన దేహాన్ని భూమిపై పడుకోబెట్టే ముందు ఆవుపేడతో నేలను అలకాలి. దర్భలు, నువ్వులు చల్లాలి. నీళ్లతో గోళాకార మండలం వేసి మధ్యలో పడుకోబెట్టాలి. తిలలు, దర్భలు లేనిదే జీవునకు శుభజన్మ కలగదు. పేడతో అలకకపోతే యక్షులు, పిశాచాలు, రాక్షసులు శవాన్ని పీడిస్తాయి. గోళాకార మండలంలో శరీరాన్ని ఉంచడం వల్ల ముక్తి పొందుతారు. 
- శ్రీ గరుడపురాణం (ధర్మకాండము, అధ్యాయం-2)
expand_less