"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 05 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం శుక్లపక్షము తిథి: పాడ్యమి ఈ రోజు ఉదయం 11గం౹౹30ని౹౹ వరకు తదుపరి విదియ వారం : భానువారము (ఆదివారం) నక్షత్రం: జ్యేష్ఠ ఈ రోజు ఉదయం 10గం౹౹15ని౹౹ వరకు తదుపరి మూల యోగం: శూల ఈ రోజు పూర్తిగా ఉంది కరణం : బవ ఈ రోజు ఉదయం 09గం౹౹27ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 03గం౹౹56ని౹౹ నుండి 04గం౹౹40ని౹౹ వరకు వర్జ్యం: సాయంత్రం 05గం౹౹41ని౹౹ నుండి 07గం౹౹10ని౹౹ వరకు అమృతకాలం రాత్రి 02గం౹౹38ని౹౹ నుండి 04గం౹౹07ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹19ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹21ని౹౹ వరకు గురుబోధ: తాంబూలం దానం ఇవ్వడం వల్ల విద్వాంసులు అవుతారని శాస్త్రం. తాంబూలంలో వాడిపోయిన, చినిగిన తమలపాకులు వినియోగించరాదు.