కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 31 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం
తిథి: ద్వాదశి రా.1.01 కు తదుపరి త్రయోదశి 01 రా.8.47 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: కృత్తిక రా.11.34 కు తదుపరి రోహిణి 01 రా.9.53 కు
యోగం: సాధ్య రా.8.31 కు తదుపరి శుభ 01 సా.5.12 కు
కరణం: బవ మ.3.26 కు తదుపరి బాలవ రా.1.48 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: మ.11:57-12:41 కు
వర్జ్యం: మ.12.24-1.54 కు
అమృతకాలం: రా. 11:20-12:46 కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 5:21 కు
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈరోజు చెయ్యాలి.
🕉️ వైకుంఠ ద్వాదశి🕉️
గురుబోధ:
కలియుగంలో భగవంతుని అనుగ్రహం శీఘ్రంగా పొందడానికి పురాణ శ్రవణమునకు మించిన గొప్ప మార్గం లేదని వ్యాసుడు చెప్పాడు. ఎన్ని పనులు ఉన్నా కొద్దిసేపు అయినా పురాణం వినడము లేదా పారాయణం చేయడం తప్పక చేయాలి. దర్భను ధరించి పురాణము వినడం , జపం చేయడం మరింత పుణ్యప్రదమని శాస్త్రం. దర్భ ఇంటిలో ఉండడం వల్ల ఇల్లు కూడా పవిత్రమవుతుంది.
పూజ్య గురుదేవుల షష్టిపూర్తి మహోత్సవ కార్యక్రమములు 2025 డిసెంబర్ 31, 2026 జనవరి 1 మరియు జనవరి 2వ తేదీలలో శాస్త్రబద్ధంగా జరుగనున్నాయి. ఈ విశేషమహోత్సవంలో కార్యక్రమములు గురుశిష్యపరంపరను వైభవంగా భాగ్యనగరంలో జరుపుకునే భాగ్యము మనకు గురుదేవులు అనుగ్రహించారు.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial