Dec 31 2024డిసెంబరు 31 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 31 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం

తిథి: పాడ్యమి 01 తె. 3.56 కు తదుపరి విదియ 02 తె. 3.31 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: పూర్వాషాఢ రా. 1.04 కు తదుపరి ఉత్తరాషాఢ 01 రా.1.34 కు
యోగం: ధ్రువ సా. 06.59 కు తదుపరి వ్యాఘాత 01 సా. 05.06 కు
కరణం: కింస్తుఘ్న మ. 03.42 కు తదుపరి బవ రా. 03.21 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.59 - 09.44 కు & రా. 11.02 - 11.54 కు
వర్జ్యం: ఉ. 10.20 - 11.58 కు
అమృతకాలం: రా. 8.20 - 9.58 కు
సూర్యోదయం: ఉ. 6.46 కు
సూర్యాస్తమయం: సా. 5.53 కు

గురుబోధ:
పుష్యమాసంలో వీలున్నంతవరకు హరినామస్మరణం మంచిది. ఒకసారి నారాయణ నామస్మరణం వలన వేయి పర్యాయములు నారాయణ నామస్మరణం చేసిన ఫలితం వస్తుంది. ఈ మాసంలో ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే అష్టాక్షరి, ద్వాదశాక్షరీ మంత్రాలను ఎంత ఎక్కువ భక్తిశ్రద్ధలతో జపిస్తే అంత శుభఫలితాలు పొందుతారు. పుష్యమాసంలో భాగవతసప్తాహన్ని చేయడం చాలా మంచిది. - నారదపురాణం

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less