"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబరు 31 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షము తిథి : చతుర్థి ఉ. 08గం౹౹16ని౹౹ వరకు తదుపరి పంచమి వారం : భానువారము (ఆదివారం) నక్షత్రం : మఘ ఈ రోజు పూర్తిగా ఉంది యోగం : ప్రీతి రా. 03గం౹౹40ని౹౹ వరకు తదుపరి అయుష్మాన్ కరణం : బాలవ ఉ. 11గం౹౹56ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 04గం౹౹33ని౹౹ నుండి 05గం౹౹23ని౹౹ వరకు వర్జ్యం : సా. 07గం౹౹09ని౹౹ నుండి 06గం౹౹08ని౹౹ వరకు అమృతకాలం : రా. 02గం౹౹54ని౹౹ నుండి 04గం౹౹39ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹33ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹31ని౹౹కు గురుబోధ స్నానం చేయకుండా వంట వండడం చేయరాదు. అలా వండిన పదార్థాలను తినరాదని శాస్త్రం. ఎంగిలి చేత్తో పొయ్యి వెలిగించడం, వంట చేయడం కూడా చేయరాదు. అగ్నిదేవుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు. ఆయన అనుగ్రహం కలగాలంటే శుచిగా వంట వండాలి. అలా చేస్తే ఇంటిలోని వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.