" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 31 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షము తిథి : నవమి రాత్రి 10గం౹౹46ని౹౹ వరకు తదుపరి దశమి వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం : రేవతి సాయంత్రం 04గం౹౹34ని౹౹ వరకు తదుపరి అశ్విని యోగం : పరిఘ ఉదయం 08గం౹౹20ని౹౹ వరకు తదుపరి శివ కరణం : కౌలవ ఈ రోజు ఉదయం 06గం౹౹33ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 07గం౹౹02ని౹౹ నుండి 07గం౹౹59ని౹౹ వరకు వర్జ్యం : లేదు అమృతకాలం : మధ్యాహ్నం 02గం౹౹12ని౹౹ నుండి 03గం౹౹46ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹34ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹32ని౹౹ గురుబోధ పూర్వం శ్రీమహావిష్ణువు ఇచ్చిన వరం వలన, నేల మీద కూర్చొని జపం చేస్తే ఆ ఫలితం భూదేవికి వెళ్ళిపోతుంది. కాబట్టి దర్భ చాప మీద కానీ, పీట మీద కానీ, కనీసం దర్భ ఒకటైనా వేసుకుని కూర్చోవాలి. కేవలం నేలమీద కూర్చొని జపం లేదా పూజ చేయరాదు. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే శ్రీ స్కాందపురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో 2023 జనవరి 01వ తేదీ ఆదివారం నుండి 2023 జనవరి 8వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.