Dec 30 2025డిసెంబరు 30 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 30 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం

తిథి: ఏకాదశి రా.3.23 కు తదుపరి ద్వాదశి 31 రా.1.01 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: భరణి రా.1.14 కు తదుపరి కృత్తిక 31 రా.11.34 కు
యోగం: సిద్ధ రా.1.01 కు తదుపరి సాధ్య రా.8.31 కు
కరణం: గరజి ఉ.7.51 కు తదుపరి వణిజ సా.6.29 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.09:01-09:45 కు, మ.11:00-11:52 కు
వర్జ్యం: ఉ.11.46-1.16 కు
అమృతకాలం: రా.11:35 - 01:03కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 5:21 కు

🕉️ వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి, రైవతమన్వాది, శ్రీ త్రైలింగ స్వామి జయంతి🕉️

ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీపారణ రేపు చెయ్యాలి.

గురుబోధ:
🕉️అన్ని వ్రతముల కన్నా ఏకాదశీ వ్రతం చాలా గొప్పది. అందునా వైకుంఠ ఏకాదశి మరింత గొప్పది. తప్పక ఈ రోజు తగినవిధంగా జపం, పురాణ శ్రవణం, ఉపవాసం చేయాలి.
🕉️ఏకాదశీ పర్వదినం నాడు ఏదో ఒక విష్ణువుకి సంబంధించిన ఆలయాన్ని దర్శించుకోవాలి. ఏకాదశి నాడు ఆవునేతి దీపం వెలిగిస్తే లక్ష యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం, హరినామస్మరణం, స్వయంపాకం దానం మంచిది. అన్నం బదులు ఫలహారం కానీ ఉప్పుడుపిండి కానీ స్వీకరించాలి. పగటినిద్ర పనికిరాదు. గురుదర్శనం, గురుప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానం.
🕉️ఒకవేళ ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేకపోతే విష్ణు శ్రీలలిత, శ్రీకృష్ణ, గణపతి, శివసహస్ర నామాలలో ఏదైనా భక్తితో పారాయణ చేసుకోవాలి. అలా చేస్తే అన్ని దోషాలు తొలగుతాయి.

https://youtu.be/udBGhD5-fUU?si=1OW0R09dvL3p6jMO

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less