"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 30 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షము
తిథి : తదియ ఉ. 08గం౹౹16ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : ఆశ్లేష 31వ తేదీ తె. 04గం౹౹40ని౹౹ వరకు తదుపరి మఘ
యోగం : విష్కంభ రా. 02గం౹౹56ని౹౹ వరకు తదుపరి ప్రీతి
కరణం : విష్టి ఉ. 09గం౹౹43ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 06గం౹౹33ని౹౹ నుండి 07గం౹౹59ని౹౹ వరకు
వర్జ్యం : సా. 04గం౹౹23ని౹౹ నుండి 06గం౹౹08ని౹౹ వరకు
అమృతకాలం : రా. 02గం౹౹54ని౹౹ నుండి 04గం౹౹39ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹33ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹31ని౹౹కు
👉🕉️ సంకష్టహర చతుర్థి 🕉️👈
గురుబోధ
గణేశుని అనుగ్రహం కోసం ప్రతిమాసం కృష్ణపక్షం లో వచ్చే చతుర్థిన సంకటహర చతుర్థి వ్రతం ఆచరిస్తారు.
శ్రీ గణేశ పంచరత్నమాలా స్తోత్రం👇
🕉️👆విఘ్నాలను, ఆటంకాలను, భయంకరమైన రోగాలను తొలగించి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని ప్రసాదిస్తుంది.
🕉️👆ఈ స్తోత్రం పారాయణం చేసినా లేక విన్నా కూడా అద్భుత ఫలితాలు లభిస్తాయి. అనుకున్న పనులు అయ్యి తీరుతాయి. ముఖ్యంగా చతుర్థి , సంకటహరచతుర్థి అందునా భాద్రపదమాసంలో గణేశచతుర్థి వచ్చినప్పుడు ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఎంతో మంచిది.
శ్రీ గణేశ భుజంగ స్తోత్రం👇
🕉️👆ఉద్యోగం కావాలనుకున్నవారు 40 రోజుల పాటు ఈ స్తోత్రాన్ని వినండి, పారాయణం చెయ్యండి, ఉద్యోగం వచ్చి తీరుతుంది.
🕉️👆విడిచిపెట్టకుండా ప్రతి శుక్లపక్ష చతుర్థినాడు ఈ స్తోత్రాన్ని విన్నవారికి సంపదలు లభిస్తాయి.
🕉️👆భార్యాభర్తల మధ్యలో కీచులాటలు ఎక్కువైపోతున్నప్పుడు తొమ్మిది (9) చతుర్థీ (చవితి) తిథులలో అనగా వరుసగా చవితి వచ్చినప్పుడల్లా, పారాయణం చేసినా, విన్నా భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వస్తుంది.