" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 30 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షము తిథి : అష్టమి రాత్రి 11గం౹౹46ని౹౹ వరకు తదుపరి నవమి వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : ఉత్తరాభాద్ర సాయంత్రం 05గం౹౹03ని౹౹ వరకు తదుపరి రేవతి యోగం : వరీయాన్ ఉదయం 09గం౹౹46ని౹౹ వరకు తదుపరి పరిఘ కరణం : విష్టి ఈ రోజు ఉదయం 06గం౹౹49ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹43ని౹౹ నుండి 09గం౹౹27ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹07ని౹౹ వరకు వర్జ్యం : తెల్లవారి 04గం౹౹48ని౹౹ నుండి 06గం౹౹22ని౹౹ వరకు అమృతకాలం : మధ్యాహ్నం 12గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹56ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹34ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹32ని౹౹ గురుబోధ ఉపవాసం ఉన్నప్పుడు, జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలచుకోరాదు. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే శ్రీ స్కాందపురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో 2023 జనవరి 01వ తేదీ ఆదివారం నుండి 2023 జనవరి 8వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.