Dec 29 2024డిసెంబరు 29 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 29 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం

తిథి: చతుర్దశి 30 తె. 3.36 కు తదుపరి అమావాస్య 31 తె. 4.01 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: జ్యేష్ఠ రా. 11.28 కు తదుపరి మూల 30 రా. 12.31 కు
యోగం: గండ రా. 09.41 కు తదుపరి వృద్ధి 29 రా. 08.32 కు
కరణం: విష్టి మ. 03.51 కు తదుపరి శకుని 30 తె. 04.01 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 04.23 - 05.07 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ. 2.05 - 3.49 కు
సూర్యోదయం: ఉ. 6.45 కు
సూర్యాస్తమయం: సా. 5.52 కు

👉🕉️ మాసశివరాత్రి 🕉️👈

గురుబోధ:
శివసహస్రనామం ఒక అద్భుతమైన అస్త్రం వంటిది. బ్రహ్మాస్త్రం కంటే పాశుపతాస్త్రం కంటే, నారాయణాస్త్రం కంటే గొప్పది."సర్వ వేదేషు యత్పుణ్యం సర్వ తీర్థేషు యత్ఫలం" సకల వేదాలూ చదవడం వల్ల వచ్చే ఫలితం,సకల తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితం, అనేక యజ్ఞములు, దానములు చేయడం వల్ల వచ్చే ఫలితం కేవలం శివసహస్రనామాన్ని చదవడం వల్ల, వినడం వల్ల పొందవచ్చును. అందుకే దీనికి సాటి వచ్చే స్తోత్రం లేదన్నారు. స్వయముగా ఆనుశాసనిక పర్వంలో శ్రీకృష్ణపరమాత్ముడు ధర్మరాజుగారికి అందించినటువంటి అపూర్వ స్తోత్రం ఇది.

శ్రీ శివసహస్రనామ స్తోత్రం👇
https://youtu.be/AcS0VMMx3lU

expand_less