"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 29 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షము
తిథి : విదియ ఉ. 06గం౹౹47ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం : పుష్యమి రా. 02గం౹౹22ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష
యోగం : వైధృతి రా. 02గం౹౹29ని౹౹ వరకు తదుపరి విష్కంభ
కరణం : గరజి ఉ. 07గం౹౹59ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹43ని౹౹ నుండి 09గం౹౹27ని౹౹ వరకు & మ. 12గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹07ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 09గం౹౹08ని౹౹ నుండి 10గం౹౹51ని౹౹ వరకు
అమృతకాలం : రా. 07గం౹౹28ని౹౹ నుండి 09గం౹౹11ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹33ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹31ని౹౹కు
గురుబోధ
కఠినంగా మాట్లాడడము, పెద్దలను అగౌరవ పరచడం, ఇతరుల చేసిన తప్పులు పదేపదే చెప్పడం, అసత్యం పలకడం వంటివి చేయడం వల్ల మనం చేసిన పుణ్యము క్షీణిస్తుంది.
సదాచారాలు పాటించేవారికి సకలశుభాలు దేవతలు ప్రసాదిస్తారు. వారు ప్రత్యేక పూజలు, జపములు కూడా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆచారాలు పాటించకుండా ఎన్ని పూజలు, జపములు చేసినా దేవతలు అనుగ్రహించరు.
తారకాసురుడి జననం👇