Dec 27 2024డిసెంబరు 27 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 27 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం

తిథి: ద్వాదశి రా. 1.14 కు తదుపరి త్రయోదశి 28 రా. 2.38 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: విశాఖ రా. 7.58 కు తదుపరి అనూరాధ 28 రా. 9.56 కు
యోగం: ధృతి రా. 10.37 కు తదుపరి శూల 28 రా. 10.24 కు
కరణం: కౌలవ మ. 01.39 కు తదుపరి తైతుల రా. 02.26 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.58 - 09.42 కు & మ. 12.40 - 01.24 కు
వర్జ్యం: రా. 12.17 - 2.01 కు
అమృతకాలం: ఉ. 10.18 - 12.03 కు
సూర్యోదయం: ఉ. 6.45 కు
సూర్యాస్తమయం: సా. 5.50 కు

🕉️ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీపారణ ఈరోజు ఉదయం చెయ్యాలి.🕉️

గురుబోధ:
శివకేశవుల మధ్య భేదం చూపరాదు. ఒకరిని ఎక్కువ చేయడం, మరొకరిని తక్కువ చేయడం వల్ల సూర్య చంద్రులు ఉన్నంత కాలం నరకంలో ఉంటారని పురాణములు చెపుతున్నాయి.
తింటున్నా, తాగుతున్నా, తిరుగుతున్నా, పడుకున్నా సర్వకాలసర్వావస్థలలో రామనామజపం నిరంతరం చేయడం వలన అదే మనల్ని రక్షిస్తుంది, తరింపచేస్తుంది.

expand_less