"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 27 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షము
తిథి : పాడ్యమి 28వ తేదీ ఉ. 06గం౹౹46ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : ఆర్ద్ర రా. 11గం౹౹28ని౹౹ వరకు తదుపరి పునర్వసు
యోగం : బ్రహ్మ రా. 02గం౹౹41ని౹౹ వరకు తదుపరి ఐంద్ర
కరణం : బాలవ సా. 06గం౹౹20ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹55ని౹౹ నుండి 12గం౹౹38ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 07గం౹౹09ని౹౹ నుండి 08గం౹౹49ని౹౹ వరకు
అమృతకాలం : మ. 12గం౹౹39ని౹౹ నుండి 02గం౹౹18ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹32ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹29ని౹౹కు
🕉️ శివముక్కోటి, ఆరుద్రోత్సవం🕉️
గురుబోధ
మార్గశీర్షంలో ఆర్ద్రా నక్షత్రం రోజున లింగాన్ని వయోభేదం, లింగభేదం లేకుండా పూజించినవారు శివునికి కుమారస్వామి కంటే ఎక్కువ ఇష్టులవుతారు.
సూర్యోదయానికి ముందు శివాభిషేకం, శివదర్శనం, శివపూజ అత్యంత పుణ్యప్రదం.
ఆర్ద్రా నక్షత్రంలో శివుడు స్తంభాకారం ధరించి, మాఘమాస కృష్ణ చతుర్దశి (శివరాత్రి) నాటికి అగ్నిస్తంభ రూపానికి వచ్చాడు.
అందుకే ఈ మాసం లో వచ్చే ఆర్ద్రా నక్షత్రం మఱియు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి (శివరాత్రి) శివునికి అత్యంత ప్రీతికరం. - శ్రీ శివమహాపురాణం