Dec 27 2022డిసెంబర్ 27 2022favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 డిసెంబర్ 27 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
పుష్యమాసం శుక్లపక్షము

తిథి : చతుర్థి ఉదయం 07గం౹౹11ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : భౌమవారం  (మంగళవారం)  
నక్షత్రం : ధనిష్ఠ  రాత్రి 08గం౹౹26ని౹౹  వరకు తదుపరి శతభిషం
యోగం :  వజ్ర సాయంత్రం 05గం౹౹28ని౹౹  వరకు తదుపరి సిద్ధి
కరణం :  బవ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹11ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹33ని౹౹ నుండి 09గం౹౹25ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹39ని౹౹ నుండి 11గం౹౹31ని౹౹ వరకు 
వర్జ్యం : తెల్లవారి 03గం౹౹12ని౹౹ నుండి 04గం౹౹42ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 10గం౹౹42ని౹౹ నుండి 12గం౹౹12ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹32ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹29ని౹౹ 

గురుబోధ
మంచివారితో స్నేహంగా ఉండడం, ఆశ్రయించడం వల్ల, వారితోపాటు తరచూ మంచిపనులు చేస్తుంటాం. బుద్ధి సక్రమంగా ఉంటుంది. ధర్మమార్గంలో నడుస్తాము. అదే చెడు లక్షణాలు, చెడు బుద్ధి గల వారిని ఆశ్రయించడం, స్నేహం చేయడం వల్ల వారి చెడు లక్షణాలు మనకు అంటుకుని వారితో పాటు చెడు పనులు చేస్తుంటాము, భ్రష్టులం అవుతాము. 
ఉదా౹౹ దుష్టుడు అయిన రావణుడ్ని ఆశ్రయించడం  వల్ల  వేలాది మంది రాక్షసులు, స్త్రీలు కూడా హనుమంతుడు లంకకు పెట్టిన నిప్పువల్ల దుర్మరణం పాలయ్యారు.



పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే స్కాందపురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో 2023 జనవరి 01వ తేదీ ఆదివారం నుండి 2023 జనవరి 8వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.

expand_less