కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 26 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం
తిథి: ఏకాదశి రా. 11.27 కు తదుపరి ద్వాదశి 27 రా. 1.14 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: స్వాతి సా. 5.39 కు తదుపరి విశాఖ 27 రా. 7.58 కు
యోగం: సుకర్మ రా. 10.24 కు తదుపరి ధృతి 27 రా. 10.37 కు
కరణం: బవ ఉ. 11.40 కు తదుపరి బాలవ రా. 12.43 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.26 - 11.10 కు & మ. 02.52 - 03.37 కు
వర్జ్యం: రా. 11.47 - 1.32 కు
అమృతకాలం: ఉ. 7.54 - 9.40 కు
సూర్యోదయం: ఉ. 6.44 కు
సూర్యాస్తమయం: సా. 5.50 కు
ఏకాదశీ ఉపవాసం ఈ రోజున ఉండాలి. ద్వాదశీ పారణము మరుసటి దినం చెయ్యాలి.
గురుబోధ:
ఎప్పుడైనా ఉపవాసం చేయగలిగిన వారు మాత్రమే ఉపవాసం చేయాలి. అది కూడా అసలు ఏమి తినకుండా ఉపవాసం చేయరాదు. అది నిరాహార దీక్ష కింద లెక్క. కనుక ఈ శరీరం నిలబడడానికి అవసరం అయినంత మాత్రమే (అనగా పళ్ళు, పాలు వంటివి) తిని రోజంతా ఆ విష్ణు నామస్మరణ, శివ నామస్మరణ చేసుకోవాలి.
https://youtu.be/DpjBm71jA_s?si=UfmlN90wggCZxhwl