కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 25 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం
తిథి: దశమి రా. 9.24 కు తదుపరి ఏకాదశి 26 రా. 11.27 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: చిత్త మ. 3.08 కు తదుపరి స్వాతి 26 సా. 5.39 కు
యోగం: అతిగండ రా. 09.47 కు తదుపరి సుకర్మ 26 రా. 10.24 కు
కరణం: వణిజ ఉ. 08.12 కు తదుపరి విష్టి రా. 10.29 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.54 - 12.39 కు
వర్జ్యం: రా. 9.18 - 11.04 కు
అమృతకాలం: ఉ. 8.01 - 9.47 కు
సూర్యోదయం: ఉ. 6.44 కు
సూర్యాస్తమయం: సా. 5.49 కు
గురుబోధ:
మనము చేసే పూజ, ఆరాధన, జపం భగవంతుడి ప్రీతి పొందడానికే. మన ఆరాధ్యదైవాన్ని "బాల లేదా బాలా" స్వరూపం (చిన్న పిల్లల) లో ఆరాధిస్తే మనం ఆరాధించే దైవం మనకు మరింత దగ్గర అవుతారని శాస్త్రం. ఉదా౹౹ బాలకృష్ణుడు, బాలదత్తుడు, బాలకుమారుడు లేదా అమ్మవారిని బాలగా ఆరాధించడం.